Saturday, December 21, 2024

చెలరేగుతున్న లంక స్పిన్నర్లు.. స్వల్ప వ్యవధిలో విహారి, కోహ్లీ ఔట్

- Advertisement -
- Advertisement -

IND vs SL 2nd Test: Kohli and Vihari dismissed

బెంగ‌ళూరు: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు(డే/నైట్) మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత బ్యాట్స్ మెన్స్ తడబడుతున్నారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ కు శభారంభం దక్కలేదు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(4), రోహిత్ శర్మ(15)లు మరోసారి నిరాశపర్చారు. ఆ తర్వాత  క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(17), హనుమ విహారీ(34)లు కూడా స్వల్ప వ్యవధిలో ఔటై పెవిలియన్ చేరారు. దీంతో 86 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. ప్రస్తుతం భారత్ 31 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. రిషబ్ పంత్(35), శ్రేయస్ అయ్యర్(6)లు క్రీజులో ఉన్నారు.

IND vs SL 2nd Test: Kohli and Vihari dismissed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News