భువనేశ్వర్: ఒడిశాలో లఖింపుర్ ఖేరి తరహా ఘటన చోటుచేసుకుంది.ఒడిశాలోని ఖుర్ధా జిల్లాలో పంచాయతీ సమితి చైర్ పర్సన్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గుమిగూడిన ప్రజలపైకి బిజెడి(బిజూ జనతా దళ్) బహిష్కృత ఎమ్మెల్యే ప్రశాంత్ జగ్ దేవ్ కారుతో దూసుకెళ్లారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఏడుగురు పోలీసులతోపాటు 23మందికి గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు కారును ధ్వంసం చేసి ఎమ్మెల్యేను బయటికి లాగి చితకబాదారు. ప్రజలు దాడి చేయడంతో ఎమ్మెల్యే తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పోలీసులు అడ్డుకుని ఎమ్మెల్యేను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే మద్యం సేవించి కారు నిడిపినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Suspended BJD MLA Car rams into Crowd in Odisha