- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ గేట్ ఎదుట కారులో మంటలు చేలరేగిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. టిఎస్09 ఈవి 3423 నంబర్ గల కారు అసెంబ్లీ గేట్ 1 వద్ద నుంచి వేగంగా వెళ్తోంది, ఈ క్రమంలోనే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ క్షణాల్లో కారులో నుంచి కిందకి దిగి ప్రాణాలను కాపాడుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడంతో అక్కడే అగ్నిమాపక సిబ్బంది విధుల్లో ఉన్నారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
- Advertisement -