Monday, December 23, 2024

పదోన్నతులు బాధ్యతను పెంచుతాయి

- Advertisement -
- Advertisement -
Promotions increase responsibility: CP Stephen Ravindra
సైబరాబాద్‌లో 125మంది పిసిలకు హెచ్‌సిలుగా ప్రమోషన్
అభినందించిన సిపి స్టిఫెన్ రవీంద్ర

హైదరాబాద్: పదోన్నతులు పోలీసులకు మరింత బాధ్యతను పెంచుతుందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 125మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు. 1990 బ్యాచ్‌కు చెందిన ఎఆర్ విభాగం నుంచి సివిల్ విభాగంలోకి నన్వర్షన్ అయిన కానిస్టేబుళ్లకు పదోన్నతి ఇచ్చారు. పదోన్నతి చిహ్నం కానిస్టేబుళ్లకు అలంకరించిన సిపి స్టిఫెన్ రవీంద్ర అభినందించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర మాట్లాడుతూ పదోన్నతి పొందిన పోలీసులు, అధికారులు మరింత ఉత్సాహంతో పనిచేయాలని, ప్రజలకు సేవ చేయాలని కోరారు. పోలీసు శాఖలో క్రమశిక్షణతో బాధ్యతగా విధులు నిర్వర్తించాలని అన్నారు. నిబద్దతతో పనిచేసేవారికి తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. గౌరవమర్యాదలు లభిస్తాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News