Monday, December 23, 2024

ప్రధాని మోడీతో యోగి ఆదిత్యనాథ్ సమావేశం

- Advertisement -
- Advertisement -

Yogi meets Modi
న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు. ఆ తర్వాత మోడీ తన ట్వీట్‌లో ‘ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేడు నాతో సమావేశం అయ్యారు. యూపి ఎన్నికల్లో చారిత్రక విజయంపై ఆయనకు అభినందనలు తెలిపాను. ఆయన గత ఐదేళ్లలో తన ఆకాంక్షలను పూర్తి చేయడానికి అహర్నిషలు పరిశ్రమించారు. రాబోయే సంవత్సరాలలో కూడా ఆయన రాష్ట్రాన్ని మరింత పైకి తీసుకెళతారని నాకు నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు. ఇదిలావుండగా ఆదిత్యనాథ్ యోగి ఇంకా బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కూడా సమావేశమయ్యారు. దీనికి ముందు ఉదయాన ఆయన ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, బిజెపి ప్రధాన కార్యదర్శి(ఆర్గనైజేషన్) బిఎల్ సంతోష్‌తో కూడా భేటీ అయ్యారు. 37 ఏళ్లలో మళ్లీ రెండో సారి ముఖ్యమంత్రి అయిన తొలి వ్యక్తి యోగి ఆదిత్యనాథ్. పార్టీలో ఆయన హోదా పెరిగినట్లయిందిప్పుడు. యోగి ఆదిత్యానాథ్ సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి సుభావతి ఉపేంద్ర దత్త శుక్లాను ఎన్నికల్లో ఓడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News