Friday, January 3, 2025

సౌదీ అరేబియాతో ఇరాన్ చర్చలు తాత్కాలికంగా రద్దు

- Advertisement -
- Advertisement -

Iran suspends talks with Saudi Arabia

 

టెహ్రాన్ :సౌదీ అరేబియాతో తాత్కాలికంగా చర్చలను రద్దు చేసేందుకు ఇరాన్ నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ ప్రత్యర్థి సౌదీ అరేబియాతో సంవత్సరాల తరబడి కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించుకోవాలన్న లక్షంతో బాగ్దాద్ మధ్యవర్తిత్వంతో చర్చలకు ఇరాన్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో చర్చలను తాత్కాలికంగా రద్దు చేసేందుకు నిర్ణయించినట్టు ఇరాన్ ప్రభుత్వంతో సంబంధం ఉన్న మీడియా ఆదివారం వెల్లడించింది. సౌదీ అరేబియా వివిధ నేరాలతో సంబంధం ఉన్న 81 మందికి మరణ శిక్ష విధించింది. ఈ శిక్ష పడిన వారిలో 36 మంది కన్నా ఎక్కువ మంది షియాలు ఉన్నారు. సౌదీ అరేబియాలో అత్యధిక శాతం మంది షియాలు ఉన్నా వారిని రెండో తరగతి పౌరులుగానే చూస్తున్నారన్న వాదం గత కొన్నాళ్లుగా సమస్యాత్మకంగా మారింది. ఈ సమస్యను పరిష్కరించుకోడానికి షియా ఆధిపత్య దేశం ఇరాన్ ఇప్పుడు సౌదీతో చర్చలకు సిద్ధమౌతోంది. అయితే మరణశిక్ష ప్రభావం ఈ చర్చలపై పడినట్టు తెలుస్తోంది. ఈ ఐదో దఫా చర్చలు మళ్లీ బుధవారం జరగుతాయని ఇరాక్ విదేశీ వ్యవహారాల మంత్రి ఇంతకు ముందే వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News