Monday, December 23, 2024

నాలుగో వికెట్ కోల్పోయి లంక..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: చినస్వామి స్టేడియం వేదికగా టీమిండియాతో జట్టుతో జరుగుతున్న రెండో టెస్టు(డే/నైట్) రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక జట్టు వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓవర్ నైట్ స్కోరు 28/1తో మూడో రోజు ఆట ప్రారంభించిన లంక బ్యాట్స్ మెన్స్ కరుణరత్నె, కుశాల్ మెండీస్ 69 పరుగులు జోడించారు. ఈ క్రమంలో అర్థశతకం బాదిన మెండీస్(54) ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మ్యాథ్యూస్(1) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో లంక ఒక పరుగు తేడాతో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన డిసెల్వా(4)ను అశ్విన్ ఔట్ చేశాడు. దీంతో లంక ఒత్తిడిలో పడింది. ప్రస్తుతం లంక జట్టు 28 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజులో కరుణరత్నె(40), డిక్వెల్లా(0)లు ఉన్నారు.

IND vs SL 2nd Test: Sri Lanka lost 4 wickets

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News