Monday, December 23, 2024

ఉక్రెయిన్‌పై పోరులో సాయం ప్లీజ్….

- Advertisement -
- Advertisement -

ఉక్రెయిన్‌పై పోరులో సాయం ప్లీజ్
చైనాకు రష్యా అభ్యర్థన…కలకలం

Russia help for china in Ukraine war

 

మాస్కో : ఉక్రెయిన్‌పై తమ పోరు క్రమంలో రష్యా చైనా సాయం కోరింది. చైనా తమకు సైనిక, ఆర్థిక సాయం అందించాలని అభ్యర్థించింది. ఉక్రెయిన్‌కు బాసటగా ఓ వైపు నాటో, అమెరికాలు నిలిచిన దశలో రష్యా అత్యంత వ్యూహాత్మకంగా చైనాను తమ వైపు ప్రసన్నం చేసుకునేందుకు యత్నించడం కీలక పరిణామం అయింది. రష్యా చైనా ఆర్థిక సైనిక సాయాన్ని కోరిందని అమెరికా మీడియా తెలిపింది. అయితే ఈ వార్తలపై స్పందించేందుకు చైనా నిరాకరించింది.

అమెరికా దురుద్ధేశపూరితంగానే తప్పుడు ప్రచారం సాగిస్తోందని, ఉక్రెయిన్ యుద్ధంలో చైనా పాత్రపై ప్రపంచ ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు యత్నిస్తోందని నిందించింది. ఇప్పుడు వెలువడ్డ మీడియా వార్తలు కట్టుకథలు అని తేల్చిచెప్పింది. రష్యా చైనా నుంచి సాయం కోరిందనే విషయాన్ని అమెరికా వర్గాలు ఏ విధంగా కూడా ధృవీకరించలేదు. ఇందుకు సాక్షాధారాలను వెలువరించలేదు. అమెరికా వార్తలను ఖండించడానికి తాము యత్నించడం లేదని, నిజాలు అందరికీ తెలిసినవే అని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. నాటో ఇప్పటి ఉక్రెయిన్ వార్‌ను విస్తరించేందుకు యత్నిస్తోందని, ఇది తూర్పు దేశాల వైపు చిచ్చును రగిల్చేలా చేయాలని చూస్తోందని చైనా మండిపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News