Saturday, November 16, 2024

కొవిడ్ నష్టపరిహారం కోసం నకిలీ డెత్‌సర్టిఫెకెట్లు … ‘సుప్రీం’ ఆందోళన

- Advertisement -
- Advertisement -

Fake Death Certificates for Covid Compensation

 

న్యూఢిల్లీ : కొవిడ్ వల్ల మరణించిన కుటుంబ సభ్యులకు ఇచ్చే నష్టపరిహారం కోసం నకిలీ దరఖాస్తులు రావడం వల్ల సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కొవిడ్ వల్ల అనాధలుగా మారిన చిన్నారుల కోసం ఇవ్వాలనుకున్న ఎక్స్‌గ్రేషియోను నకిలీ ధ్రువీకరణ పత్రాలతో అక్రమంగా కాజేయాలని చూడడం దారుణమని సుప్రీం తెలిపింది. దీంట్లో ఎవరైనా ఆఫీసర్లు ఉంటే అది సీరియస్ మ్యాటర్ అవుతుందని జస్టిస్ ఎంఆర్ షా తెలిపారు. జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీనిపై అత్యున్నత దర్యాప్తు చేపట్టాలని కాగ్‌ను ధర్మాసనం ఆదేశించింది.

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఇచ్చిన నివేదిక ఆధారంగా కోర్టు స్పందించింది. ఆర్‌టీపీసీఆర్ రిజల్ట్‌తోపాటు డెత్ సర్టిఫికెట్ సమర్పించే వారికి రూ.,50 వేలు నష్టపరిహారం అందిస్తున్నారు. ఆయా రాష్ట్రాలు తమ విపత్తు నిధుల నుంచి ఆ పరిహారాన్ని అందిస్తున్నాయి. నకిలీ మరణపత్రాలు సమర్పిస్తే వారికి రెండేళ్ల జైలు శిక్ష ఉంటుందని పిటిషనర్ అడ్వకేట్ గౌరవ్‌కుమార్ తెలిపారు. నష్టపరిహారం దరఖాస్తులు స్వీకరించేందుకు ఏదైనా డెడ్‌లైన్ పెట్టాలని తుషార్ మెహతా కోరారు. ఒక్కొక్క మృతుడి కుటుంబానికి రూ.50 వేలు ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరూ కొవిడ్‌తో చనిపోతే వారి పిల్లలకు ఆ ఇద్దరి నష్టపరిహారాన్ని ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News