Sunday, December 22, 2024

ఒబామాకు కరోనా పాజిటివ్

- Advertisement -
- Advertisement -

Obama tests positive for COVID-19

 

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కరోనా బారినపడ్డారు. తనకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఒబామా స్వయంగా వెల్లడించారు. కరోనా నిర్ధారణ పరీక్షలో తన భార్య మిషెల్లెకు నెగటివ్‌గా తేలిందని ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. కొద్ది రోజులుగా తనకు గొంతులో ఇబ్బందిగా ఉందని, ఇతర ఆరోగ్య సమస్యలేవీ తనకు లేవని ఆయన తెలిపారు. తాను, తన భార్య రెండు డోసుల వ్యాక్సినేషన్‌తోపాటు బూస్టర్ డోసు కూడా వేసుకున్నామని ఒబామా తెలిపారు. అమెరికాలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినప్పటికీ అమెరికన్ ప్రజలు వ్యాక్సినేషన్ వేసుకోవాలని ఒబామా పెద్ద ఎత్తున ప్రోత్సహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News