Friday, November 15, 2024

ఉక్రెయిన్ ‘మారణ’పోల్

- Advertisement -
- Advertisement -

City of Mariupol turned bloody with Russian invasions

రష్యా దాడులతో నెత్తుటిగడ్డగా మారిన మరియుపోల్ నగరం

మృతులు 2500మందికి
పైనే వీధుల్లో శవాలు,
సామూహిక అంత్యక్రియలు
మానవీయ సాయానికి
అడ్డంకులు ప్రసూతి
ఆస్పత్రిపై బాంబులు

పసికందు దుర్మరణం

కీవ్: రష్యా భీకర దాడులతో ఉక్రెయిన్‌లోని మరియుపోల్‌లో దారుణ శ్మశాన స్థితి నెలకొం ది. ఎటుచూసినా విధ్వంసం, శవాల గుట్టల తో, రోదనలతో జనం కన్పిస్తున్నారు. శవాల ది బ్బల మాదిరిగా మేరియుపోల్ మారిందని వార్తాసంస్థలు తెలిపాయి. రష్యా భీకర దాడుల తో ఇప్పటికే ఇక్కడ మృతుల సంఖ్య2500 దా టిందని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు ఒలె క్సీ అరెస్టోవిచ్ తెలిపారు. చాలా రోజులుగా ఈ ప్రాంతం రష్యా సైనికుల దాడులకు గురవు తూ వస్తోంది. రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతోంది. దీంతో పలు ప్రాంతాలలో సా మూహికఅంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. క్షతగాత్రుల రోదనలతో పరిస్థితి దిగజారుతోంది. ఈ ప్రాంతానికి అందుతున్న వివిధ దేశాల మానవతా సాయాన్ని కూడా విచ్ఛిన్నం చేసే రీతిలో రష్యా భీకర దాడులకు పాల్పడుతోందని నిర్థారించారు. రాజధాని కీవ్‌ను కైవసం చేసుకునేందుకు రష్యా సాగిస్తోన్న దాడి కీలక ఘట్టానికి చేరుకొంటోంది. ఈ క్రమంలో ఎటుచూసినా భయానక స్థితి నెలకొంటోంది. మరో వైపు కీవ్‌పైసోమవారం ఓ భవనంపై జరిగిన బాంబుదాడిలో ఇద్దరు పౌరులు మృతి చెందారు.

ప్రసూతి ఆసుపత్రిపై రష్యా బాంబులు
గర్భిణి పొత్తిళ్ల పసికందు మరణం

మేరియూపోల్‌పై ఓ ప్రసూతి ఆసుపత్రిపై రష్యా సేనలు బాంబులు కురిపించిన ఘటనలో ఓ గర్భిణి, ఓ పసికందు మృతి చెందారని స్థానిక అధికారులు తెలిపారని ఎపి వార్తా సంస్థ వెల్లడించింది. ప్రసవానికి ఆసుపత్రికి వచ్చిన మహిళ ఉదంతంతో ఇక్కడ విషాదం నెలకొంది. పూర్తిగా నెత్తురోడుతున్న గర్భిణిని స్ట్రెచర్‌పై తరలిస్తూ ఉండటం ఇక్కడ పరిస్థితిని చాటింది. మట్టి దిబ్బలాగా మారిన ఈ ప్రాంతంలో ఆసుపత్రిపై దాడి తరువాత ఈ మహిళను వేరే చోటికి తరలించారు. అప్పటికే గర్భస్రావం అయి బిడ్డను కోల్పోయిన ఈ తల్లి తనకు విషయం తెలియడంతో తనను కూడా చంపేయండని అరుస్తూ ఉండటం హృదయ విదారకం అయింది. అరగంట సేపు కనీసం తల్లిని అయినా కాపాడేందుకు డాక్టర్ల బృందం యత్నించింది. అయితే ఎటువంటి ఫలితం కన్పించలేదు. ముందు బిడ్డ తరువాత తల్లి ప్రాణాలు పొయ్యాయి.

అయితే ఈ మెటర్నీటి ఆసుపత్రిని ఉక్రెయిన్ తీవ్రవాదులు తమ కేంద్రంగా వాడుకుంటూ రష్యా సేనలను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని మాస్కో నుంచి ప్రకటన వెలువడింది. ఈ ప్రాంతంలో మానవీయ సాయంఅందకుండా నిలిపివేస్తూ జరుగుతోన్న తతంగంతో వాస్తవంగా ఇక్కడ ఏ మేరకు మారణహోమం జరుగుతున్నదనేది బయటి ప్రపంచానికి తెలియడం లేదు. యుద్ద నేరాలు అత్యధికంగా వెలుగులోకి వస్తున్నాయి. తమ సేనలు మెటర్నీటి హాస్పిటల్‌పై దాడికి దిగాయనే వార్తలను రష్యా అధికారికంగా ఖండించింది. వెలువడ్డ ఫోటోలు పనిగట్టుకుని సృష్టించినవే అని విమర్శించారు. ఈ విషయాన్ని ఐరాస, లండన్ ఎంబస్సీలలోని రష్యా దౌత్యవేత్తలు తెలియచేశారు.కీవ్ దిశలో పలు ప్రాంతాలలో విధ్వంసాన్ని సృష్టిస్తూ రష్యా సైన్యం ముందుకు వెళ్లుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News