Saturday, December 21, 2024

తహసీల్దార్ ఆఫీసులో విఆర్‌ఎ హత్య

- Advertisement -
- Advertisement -

VRA murder in tehsildar's office

మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలో
ఆదివారం అర్ధరాత్రి విధుల్లో ఉండగా హతమార్చిన దుండగలు

మన తెలంగాణ/కన్నెపల్లి: తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న విఆర్‌ఎను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన సంఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. కొత్తపల్లి గ్రామానికి చెందిన విఆర్‌ఏ దుర్గం బాపు (50) ఆదివారం రాత్రి తహసీల్దార్ కార్యాలయంలో పని నిమిత్తం ఉండటంతో అర్థరాత్రి దాటాక దుండగలు కార్యాలయంలోకి ప్రవేశించి హత్య చేశారు. సోమవారం ఉదయం స్థానికులు కార్యాలయం తలుపులు తీసి ఉండడంతో లోపలికి చూడగా రక్తం మడుగులో బాబు పడి ఉన్నాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ సురేష్, ఏసిపి ఎడ్లమహేష్, ఆర్‌డిఓ శ్యామలాదేవి, సిఐ బాబురావు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. డాగ్‌స్వాడ్‌లతో తనిఖీలు నిర్వహించారు.

డాగ్‌స్వాడ్‌లు సంఘటన స్థలం నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్త గ్రామం వద్దకు వెళ్లాయి. ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ హత్య చేసిన నిందితులను త్వరలోనే పట్టుకొని శిక్ష పడేలా చూస్తామని ఆయన తెలిపారు. మృతుని కుటుంబీలకులు మాత్రం పాత కక్షలతోనే హత్యచేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్త పల్లి గ్రామానికి చెందిన దుర్గం లింగయ్య, జంబి రవిలపై అనుమానం ఉందని ఫిర్యాదు పేర్కొన్నట్లు తెలిపారు. దుర్గం లింగయ్యను అదుపులోకి తీసుకున్నామని, జంబి రవి పరారీలో ఉన్నాడని వారు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News