Saturday, November 23, 2024

ఆ జెండాలు మ్యూజియంలో ఉండబోతున్నాయి: జీవన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Congress bjp flags kept in museum

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీ దుకాణాలు త్వరలోనే బంద్ అవుతున్నాయనీ, ఆ పార్టీల జెండాలు మ్యూజియం లో పెట్టబోతున్నారని, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ శాసన సభలోని మీడియా పాయంట్‌లో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో కాంగ్రెస్, బీజేపీ నేతల ప్రసంగాలపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశం నడుస్తున్న సమయంలో కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు సబ్జెక్ట్ లేక ఎం మాట్లాడుతున్నారో వారికే అర్ధం కావడంలేదన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత కాంగ్రెస్ నేతలు ఎం మాట్లాడాలో తెలియక నీళ్ళు నములుతున్నారనీ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో భూమి నుండి అంతరిక్షం వరకు అన్ని స్కాములేనని, స్కీముల పేరుతో ప్రజలకి టోకరా వేయడం ఆ పార్టీకి కొత్తేం కాదనీ, డివైడ్ అండ్ రూల్ అనే తెల్ల వాళ్ళ ఫార్ములా వాడి ప్రజలను మభ్య పెడతారనీ పేర్కొన్నారు. ఆ పార్టీలో సీఎం అంటే కరెప్షన్ మాన్ అని. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆరుగురిలో ఒక్కొక్కరు ఒక్కటి మాట్లాడుతారనీ, అందుకే మూడు రంగులు ఆరు పార్టీలుగా ఉన్నారని, సోనియాగాంధీ హయాంలో అమరెందర్ సింగ్ ను అప్పుడే జైలుకు పంపిస్తే అయిపోయేదని, అలా జరగనందుకు విచారిస్తున్నానన్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి పై తెలంగాణ లో బీసీలందరూ తుతు అంటూ ఉస్తున్నారని విమర్శించారు.

మరోపక్క కోమటిరెడ్డి బ్రదర్స్ ఉదయం కేసీఆర్ ని పొగుడుతారనీ, సాయంత్రం మోడీ ని కలుస్తారనీ., మోడీ మెప్పు పొంది అన్నదమ్ములు బీజేపీ లో చేరడానికి ప్రయత్నిస్తున్నారనీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. పదవీ కాంక్షతో వారు 3 జెండా రంగులు, ఆరు పార్టీల లాగా వ్యవహరిస్తారని, ఆ ఇద్దరు అన్నదమ్ములను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో చేర్పించాలంటూ ఎద్దేవా చేశారు.  పార్టీలు జంపింగులు చేస్తూ పోతే, నాయకులకు కాకపోయినా, ప్రజలకేం నమ్మకం కలిగిస్తారంటూ నిగ్గదీసి ప్రశ్నించారు. అంతే కాకుండా బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గర్వాన్ని ప్రదర్శిస్తూ తన పేరుకు తగ్గట్టుగా వచ్చేలాగ ట్రిపుల్ ఆర్ అంటూ సినిమా పేరు పెట్టుకున్నారనీ, దాని అర్థం రెచ్చగొట్టడం, రచ్చచేయడం,రెచ్చిపోవడం అంటూ చురకలంటించారు. బీజేపీ ఎమేమెల్యే రఘునందన్ రావు స్పీకర్ ని ముందే వేడుకుని ఉంటే ఈరోజు అసెంబ్లీ లో మాట్లాడేవారు కదా అని, ఆయన కోసం ప్రత్యేకంగా రాత్రి 12 గంటల వరకు అసెంబ్లీ లో మాట్లాడడానికి అవకాశం ఇస్తామంటూ వ్యాఖ్యానించారు. 91,400 మంది నిరుద్యోగులు ప్రతిపక్షాల మాయమాటలకు తలొగ్గకుండా, బంగారు తెలంగాణ నిర్మాణం లో భాగస్వామ్యం కావాలనీ ఆయన ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News