- Advertisement -
న్యూఢిల్లీ : యునైటెడ్ సర్వీస్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా (యుఎస్‌ఐ) సంస్థలో దివంగత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ స్మారక చైర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (ఉత్కృష్ట పీఠం)ను నెలకొల్పుతున్నట్టు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవనే మంగళవారం వెల్లడించారు. జనరల్ రావత్ 65 వ పుట్టిన రోజు సందర్భంగా ఒక రోజు ముందుగా ఒక కార్యక్రమంలో ఈ ప్రకటన వెలువడింది. గత డిసెంబర్ 8న తమిళనాడులో కూనూరు సమీపాన హెలికాప్టర్ ప్రమాదంలో రావత్ మరణించిన సంగతి తెలిసిందే. సాయుధ బలగాల ఉమ్మడి, ఏకీకరణ లక్షంగా ఈ పీఠం పనిచేస్తుంది. దేశ భద్రత, మిలిటరీ వ్యవహారాల్లో అనుభవం ఉన్న సాయుధ బలగాల అధికారులకు మేథావులకు తగిన పరిశోధనకు ఈ పీఠం వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు.
- Advertisement -