Saturday, November 16, 2024

దేశంలో మాగ్నమ్‌ వింగ్స్‌ మొట్టమొదటి యుఏవీ విడుదల..

- Advertisement -
- Advertisement -

Magnum Wings LLP unveiled its first commercial UAV in India

హైదరాబాద్‌: మాగ్నమ్‌ వింగ్స్‌ ఎల్‌ఎల్‌పీ గురువారం తమ మొట్టమొదటి వాణిజ్య యుఏవీ (మానవ రహిత విమాన వాహనం) ఎండబ్ల్యు వైపర్‌ను విడుదల చేసింది. ఈ యుఏవీని భారతదేశం కోసం ఓ భారతీయుడు రూపొందించాడు. దీనిని ప్రభుత్వ రంగ సంస్థలతో పాటుగా వాణిజ్య సంస్ధల అవసరాల కోసం కూడా వినియోగించవచ్చు.

ఎండబ్ల్యు వైపర్‌ చక్కటి గ్రౌండ్‌ సర్వే, పే లోడ్‌ డెలివరీ మరియు సర్వైవలెన్స్‌ మిషన్స్‌కు భరోసా అందిస్తుంది. గరిష్ట నిర్వహణ సామర్ధ్యం మరియు మిషన్‌ ఫ్లెక్సిబిలిటీని ఇది అందిస్తుంది. ఎండబ్ల్యువైపర్‌ వర్టికల్‌ టేకాఫ్‌ తీసుకోవడంతో పాటుగా కనీసం 5కేజీల నుంచి గరిష్టంగా 60 కేజీల పేలోడ్‌ తీసుకువెళ్తుంది. ఇది గంటకు 30 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది విభిన్నమైన అల్టిట్యూడ్స్‌ 100 అడుగులు, 400 అడుగులు, 2వేల అడుగుల వద్ద ప్రయాణించడంతో పాటుగా ఏకధాటిగా 2గంటల పాటు పయణిస్తుందన్న భరోసా అందిస్తుంది. ఎండబ్ల్యు వైపర్‌ను వైద్య అత్యవసరాలు, త్వరగా పాడయ్యే ఆహార పదార్ధాల రవాణాకు సైతం వాడవచ్చు. అలాగే డ్రోన్లు పనిచేయలేని చోట కూడా ఇది తగిన సేవలను అందిస్తుంది.

ఈ ఆవిష్కరణ సందర్భంగా అభిరామ్‌ చావా, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, మాగ్నమ్‌ వింగ్స్‌ ఎల్‌ఎల్‌పీ మాట్లాడుతూ ‘‘భారత ప్రభుత్వ మేక్‌ ఇన్‌ ఇండియా లక్ష్యంలో భాగం కావడం పట్ల సంతోషంగాఉన్నాము. ఈ యుఏవీలను భారతదేశంలో అసెంబెల్‌ చేయలేదు కానీ వీటిని ఇక్కడే తీర్చిదిద్ది, తయారుచేయడం జరిగింది. వీటిలో అత్యధిక భాగాలను ఇండియాలోనే సేకరించడం జరిగింది. ఎండబ్ల్యు వైపర్‌ను వాణిజ్య వినియోగానికి అందుబాటులో ఉంచిన తరువాత దీనిని బీపీసీఎల్‌, గోయెంకా, ఎస్‌బీఐ,ఎన్‌జీఆర్‌ఐ తదితర సంస్ధల ముంగిట ప్రదర్శించాము’’ అని అన్నారు.

Magnum Wings LLP unveiled its first commercial UAV in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News