Monday, December 23, 2024

‘కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్ ’ థీమ్ రన్ ప్రారంభించిన జగపతి బాబు, దిల్ రాజు

- Advertisement -
- Advertisement -

ఎఐఎన్‌యు ఆధ్వర్యంలో ‘కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్ ’ థీమ్ రన్ ప్రారంభించిన సినీనటులు జగపతి బాబు, దర్శకులు దిల్ రాజు

మన తెలంగాణ/సిటీ బ్యూరో: కిడ్నీ ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తూ ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ(ఎఐఎన్‌యు) ఆధ్వర్యంలో ‘కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్ ’ థీమ్‌తో రన్ నిర్వహించారు. 5,10, కి.మి. విభాగాలుగా నిర్వహించిన ఈ రన్‌ను హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ప్రముఖ సినీనటులు జగపతి బాబు, దర్శకులు దిల్ రాజు, ఎఐఎన్‌యూ ఎండి డాక్టర్ సి.మల్లికార్జున, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ పిసిరెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా డాక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ ప్రపంచ కిడ్ని దినోత్సవం పురస్కరించుకుని ప్రతి ఏటా మార్చిలో ఏషియన్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెప్రాలజీ అండ్ యూరాలజీ ఆధ్వర్యంలో కిడ్ని అవగాహన రన్ నిర్వహిస్తోందని తెలిపారు. తమ కిడ్ని ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని కోరుతున్నమన్నారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News