రష్యా ప్రతిపాదనకు నో
మాస్కో : యుద్ధ తీవ్రత దశలో రష్యా నుంచి ఉక్రెయిన్‌కు తటస్థ హోదా ఇస్తామని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ ప్రతిపాదించారు. దీనిని ఉక్రెయిన్ అన్ని కోణాలలో పరిశీలించి తోసిపుచ్చింది. రష్యా ప్రతిపాదన నమ్మశక్యంగా లేదని తెలిపింది. ఆస్ట్రియా లేదా స్వీడన్ మాదిరిగా న్యూట్రల్ స్టేటస్‌ను ఇస్తామని అంతర్జాతీయ విమర్శల నేపథ్యంలో పుతిన్ ప్రకటించారు. అయితే పుతిన్ ప్రకటనను నమ్మడం లేదని, దీనికి అంతర్జాతీయ సేనల నుంచి గ్యారంటీ అవసరం అని ఉక్రెయిన్ తేల్చిచెప్పింది. ఉక్రెయిన్ నేత అమెరికా చట్టసభలను ఉద్ధేశించి ప్రసంగించడం, అన్ని దిక్కుల నుంచి ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యా ఇప్పుడు కొంత దిగివచ్చిన వైనం పుతిన్ ప్రతిపాదనతో వెల్లడైంది. ఉక్రెయిన్ ఇప్పుడు రష్యాతో నేరుగా తలపడుతోంది. ఈ దశలో రషా నుంచి వచ్చే ఎటువంటి ప్రతిపాదన అయినా చట్టబద్ధం కావల్సిందే అని ఉక్రెయిన్ తెలిపింది. ఓ వైపు రష్యా తాజాగా శాంతి ప్రతిపాదనలు చేస్తూనే కీవ్‌పై భీకరదాడులకు దిగుతోంది, ఉక్రెయిన్ రాజధానిని పూర్తిగా కైవసరం చేసుకునే దిశలో కీవ్‌కు కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే రష్యా సేనలు తిష్టవేసుకున్నాయి.