- Advertisement -
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రా నాలుగో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో నిలకడైన బౌలింగ్ కనబరచడంతో బుమ్రా తన ర్యాంక్‌ను గణనీయంగా మెరుగుపరుచుకున్నాడు. ఏకంగా ఆరు ర్యాంక్‌లను మెరుగుపరుచుకుని నాలుగో స్థానానికి ఎగబాకాడు. రవిచంద్రన్ అశ్విన్ తన రెండో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. బ్యాటింగ్ విభాగంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి 9వ ర్యాంక్‌కు పడిపోయాడు. కిందటి ర్యాంకింగ్స్‌లో కోహ్లి ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక లంక కెప్టెన్ కరుణరత్నె ఐదో ర్యాంక్‌కు చేరుకున్నాడు.
- Advertisement -