Tuesday, December 24, 2024

ఇంగ్లండ్‌కు తొలి విజయం

- Advertisement -
- Advertisement -

మిథాలీ సేనకు రెండో ఓటమి

మౌంట్‌మాంగనూయి: మహిళల వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ తొలి విజయాన్ని నమోదు చేసింది. తొలి మూడు మ్యాచుల్లో ఓటమి పాలైన ఇంగ్లండ్ బుధవారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక టీమిండియా ఈ ప్రపంచకప్‌లో రెండో ఓటమిని చవిచూసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 36.2 ఓవర్లలో కేవలం 134 పరుగులకే ఆలౌటైంది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఇంగ్లండ్ 31.2 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. సునాయాసమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది.

ఓపెనర్లు డానియెల్లి వ్యాట్ (1) టామి బ్యూమౌంట్ (1)లను భారత బౌలర్లు ప్రారంభంలోనే వెనక్కి పంపారు. అయితే కెప్టెన్ హీథర్ నైట్, స్టార్ బ్యాటర్ నటాలి షివర్‌లు ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. షివర్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. నైట్ కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అలరించింది. ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు 65 పరుగులు జోడించారు. అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన షివర్ 8 ఫోర్లతో వేగంగా 45 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను కెప్టెన్ నైట్ తనపై వేసుకుంది. వికెట్ కీపర్ అమీ జోన్స్ (10), సోఫియా డంక్లి (17)తో కలిసి జట్టును లక్షం దిశగా నడిపించింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా చివరి వరకు అజేయంగా నిలిచిన నైట్ ఇంగ్లండ్‌కు టోర్నీలో తొలి విజయాన్ని అందించింది. నైట్ 72 బంతుల్లో 8 బౌండరీలతో 53 పరుగులు చేసి నాటకౌట్‌గా నిలిచింది. భారత బౌలర్లలో మేఘన సింగ్ మూడు వికెట్లు తీసింది.

తక్కువ స్కోరుకే..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ఇంగ్లండ్ బౌలర్లు సఫలమయ్యారు. ఓపెనర్ యాస్తిక భాటియా (8), కెప్టెన్ మిథాలీ రాజ్ (1), దీప్తి శర్మ (0) ఘోరంగా విఫలమయ్యారు. వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (14) కూడా జట్టుకు అండగా నిలువలేక పోయింది. అయితే ఓపెనర్ స్మృతి మంధాన (35), వికెట్ కీపర్ రిచా ఘోష్ (33) కాస్త మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు. సీనియర్ క్రికెటర్ గోస్వామి (20) తనవంతు పాత్ర పోషించింది. ఇంగ్లండ్ బౌలర్లలో చార్లొట్ డీన్ నాలుగు, అన్యాశ్రుబ్‌సోల్ రెండు వికెట్లు పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News