Monday, December 30, 2024

డాషింగ్ అవతార్‌లో…

- Advertisement -
- Advertisement -

Sarkaru wari pata movie

పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. సినిమా నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. తమన్ ఈ చిత్రానికి అందించారు. మొదటి సింగిల్ ‘కళావతి…’ రికార్డు వీక్షణల పరంగా కొత్త బెంచ్‌మార్క్‌లను సృష్టించింది. మంత్రముగ్ధులను చేసే ఈ మెలోడీ ఇప్పటికే 90 మిలియన్ల వ్యూస్‌ను దాటింది. ఇది అతి త్వరలో 100 మిలియన్ల మార్క్‌ను దాటడానికి సిద్ధంగా ఉంది.

ఈ చిత్రం నుండి రెండవ సింగిల్ పెన్నీని ఈనెల 20న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో మహేష్ బాబు డాషింగ్ అవతార్‌ను ప్రదర్శించాడు. ఇందులో సూపర్‌స్టార్ సీరియస్‌గా కనిపిస్తున్నాడు. ఇక మొదటి పాట పెద్ద హిట్ కావడంతో రెండో సింగిల్ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ‘సర్కారు వారి పాట’ చిత్రం మే 12న వేసవి కానుకగా రాబోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News