- Advertisement -
హైదరాబాద్: నిద్ర సరిగా లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రతి ఏటా మార్చి మూడో శుక్రవారాన్ని ‘ప్రపంచ నిద్ర దినోత్సవం’గా జరుపుకుంటారు. దీన్నే ఇంగ్లీషులో ‘స్లీప్ డే’ అంటారు. మారిన జీవనశైలి కారణంగా నిద్రలేమి ఏర్పడి ఆరోగ్య సమస్యలు చిన్నాపెద్ద అందరికీ ఏర్పడుతున్నాయి. రోజుకు 8 గంటల నిద్ర సరిగా లేకపోతే అది మిగతా 16 గంటల మెలకువ సమయాన్ని దెబ్బతీస్తుంది. నిద్ర సరిగా లేకపోతే మనిషి మెదడుపై దుష్ప్రాభావం పడుతుంది.
- Advertisement -