- Advertisement -
బెంగళూరు : కర్నాటక రాష్ట్రంలోని స్కూళ్లలో భగవద్గీతను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం అయింది. ఈ దిశలో అన్ని అంశాల పరిశీలన జరుగుతోందని, త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని కర్నాటక మాధ్యమిక విద్యాశాఖ మంత్రి బిసి నగేష్ శుక్రవారం ఇక్కడ విలేకరులకు తెలిపారు. ఇప్పటికే బిజెపి పాలిత గుజరాత్ రాష్ట్రంలో గీతను పాఠ్యాంశం చేశారు. తరువాతి క్రమంలో కర్నాటకలోని బిజెపి ప్రభుత్వం కూడా దీనికి సిద్ధం అయింది. అన్ని విషయాలను తాము ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైతో చర్చించి నిర్ణయిస్తామని మంత్రి వివరించారు.
- Advertisement -