Thursday, December 19, 2024

హెరాయిన్ విక్రయిస్తున్న నలుగురు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

4 arrested in brown sugar selling in hyderabad

హైదరాబాద్: నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ లో శుక్రవారం రాత్రి బ్రౌన్ షుగర్ విక్రయిస్తున్న నలుగురిని మల్కాజ్‌గిరి ఎస్ఓటి, నాచారం పోలీసులు పట్టుకున్నారు. వెస్ట్ బెంగాల్ కి చెందిన ఎండి అక్తర్ ఉజ్మాన్ అనే వ్యక్తి సప్లయర్ ను, షెక్ దినేష్, మెహబూబ్ ఖాన్, ఎండి నజీర్ అనే ముగ్గురు కస్టమర్ లను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. శహజాన్, ఒప్పు, మెహతబ్ ఆలం అనే ముగ్గురు పరారీలో ఉన్నారని, నిందితుల వద్ద నుంచి 16 గ్రాముల హెరాయిన్ (బ్రౌన్ షుగర్), ఒక వేయింగ్ మిషన్, రూ 19 వేల నగదు, సిల్వర్ పాకింగ్ కవర్స్, 5 సెల్ ఫోనులను సీజ్ చేశామని పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News