- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ జాతిపిత మహాత్మాగాంధీ బాటలో నడుస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మహారాష్ట్ర పర్యటనలో ఉన్న మంత్రి శనివారం నాడు జల్‌గావ్ జైన్ హిల్స్‌లో గాంధీ తీర్డ్ మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ అహింసా మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. మహాత్ముని బాటలోనే సమాజంలోని సబ్బండ వర్ణాల సంక్షేమం, అభివృద్ది లక్షంగా పనిచేస్తున్నారని తెలిపారు. అందరి ఉన్నతే మహాత్ముని ఆకాంక్ష అని, వ్యక్తిగా మొదలై శక్తిగా ఎదిగన మహాత్ముని సంపూర్ణ జీవితంపై మ్యూజియం ఏర్పాటు అద్భుతమన్నారు. ప్రపంచంలోనే ఇది అరుదైన అతిపెద్ద మ్యూజియం అని గాంధీజీ పట్ల తపన, ఆరాధన, అంకితభావం ఉంటేనే ఇది సాధ్యమని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
- Advertisement -