కీవ్: ఉక్రెయిన్ దాడులు శనివారానికి 24వ రోజుకు చేరుకున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరోసారి చర్చలకు పిలుపునిచ్చారు. ‘ ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన, ఉక్రెయిన్ల భద్రత విషయంలో అర్థవంతమైన చర్చలే.. రష్యాకుతన స్వీయ తప్పిదాలనుంచి కలుగుతున్న నష్టాలను తగ్గించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం’ అని అన్నారు. ‘కలిసేందుకు .. మాట్లాడేందకు.. ఉక్రెయిన్‌కు న్యాయం చేకూర్చేందుకు ఇదే తగిన సమయం. లేకపోతే రష్యా భారీ నష్టాలను చవి చూడవలసిఉంటుంది. పుంజుకోవడానికి తరాలు సరిపోవు’ అని రాత్రిపూట జాతినుద్దేశించి చేసిన ఓ వీడియో సందేశంలో జెలెన్‌స్కీ అన్నారు. కీవ్‌లోని అధ్యక్ష భవనం వెలుపల ఈ వీడియోను రికార్డు చేశారు.‘14 వేల మృతదేహాలు, మరిన్ని వేల మంది క్షతగాత్రులతో ఉన్న మాస్కోలోని స్టేడియంను ఊహించుకోండి. ఈ దురాక్రమణలో రష్యా చెల్లించుకున్న మూల్యం ఆ మరణాలు’అని జెలెన్‌స్కీ ఆ వీడియోలు అన్నారు.