- Advertisement -
తిరువనంతపురం: కేరళలోని మలప్పురం ఫుట్ బాల్ టోర్నీలో అపశృతి చోటుచేసుకుంది. ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతుండగా ఒక్కసారిగా ప్రేక్షకులు కూర్చున్న గ్యాలరీ కుప్పకూలింది. ఈ ఘటనలో దాదాపు 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇనుప చువ్వల్లో చిక్కుకున్నవారిని బయటికి తీసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
40 Injured as Football Stadium Gallery collapse in Kerala
- Advertisement -