- Advertisement -
ఆర్‌జెడిలో ఎల్‌జెడి విలీనం
పాట్నా: ప్రతిపక్షాల ఐక్యత విషయంలో తొలి అడుగుగా మా పార్టీ లోక్‌తాంత్రిక్ జనతా దళ్(ఎల్‌జెడి)ని లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్(ఆర్‌జెడి)లో కలుపుతున్నాం అని మాజీ కేంద్ర మంత్రి శరద్ యాదవ్ తెలిపారు. బిజెపిని ఓడించడానికి దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఐక్యత కావడం అన్నది తప్పనిసరి. ఐక్యతే మా ప్రాధాన్యత. ఆ తర్వాతే మేము ఎవరు ఐక్య ప్రతిపక్షానికి నేతృత్వం వహిస్తారన్నది ఆలోచిస్తాం అని ఆయన అన్నారు.
- Advertisement -