Monday, December 23, 2024

మారియుపోల్ పాఠశాలపై రష్యా బాంబులు

- Advertisement -
- Advertisement -

Ukraine
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌కు చెందిన కైవ్ ప్రాంతంలోని మకారివ్‌పై రష్యా శుక్రవారం మోర్టార్ మోర్టార్ దాడి చేయగా ఏడుగురు చనిపోయారని, ఐదుగురు ఆసుపత్రిపాలయ్యారని అక్కడి స్థానికి పోలీసులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇదిలావుండగా
దాదాపు 400 మంది ఆశ్రయం పొందిన ఆర్ట్ స్కూల్‌పై రష్యా సైన్యం బాంబు దాడిచేసిందని మారిపోల్ అధికారులు తెలిపారు. పాఠశాల భవనం ధ్వంసమైందని, శిథిలాల కింద ప్రజలు ఇంకా ఉండొచ్చని స్థానిక అధికారులు ఆదివారం తెలిపారు. కాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్సీ జాతీయ టివి ఛానెళ్లను ఒకే ప్లాట్‌ఫారమ్‌గా మిళితం చేసే డిక్రీపై సంతకం చేశారు. ఈ సందర్భంగా మార్షల్ లా కింద ‘ఏకీకృత సమాచార విధానం’ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడిచేయడం ఆరంభించినప్పటి నుంచి ఉక్రెయిన్ ప్రైవేట్ యాజమాన్యంలోని మీడియా ఛానెళ్లు ఇప్పటి వరకు పనిచేస్తూనే ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News