Monday, December 23, 2024

ఎన్నికల్లో లబ్ధికి కశ్మీర్ ఫైల్స్ అస్త్రం

- Advertisement -
- Advertisement -
Sanjay Raut Comments on Kashmir Files movie
బిజెపిపై సంజయ్ రౌత్ విమర్శ

ముంబై : కేంద్రంలోని బిజెపి రాజకీయ లబ్ధికి అన్ని అవకాశాలను వినియోగించుకొంటోందని శివసేన ఎంపి సంజయ్ రౌత్ విమర్శించారు. ఇకపై జరిగే అసెంబ్లీ ఎన్నికలలో సత్ఫలితాలు సాధించుకునేందుకు బిజెపి ఇప్పుడు ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను ప్రోత్సాహిస్తోందని, ఇది రాజకీయ చిత్రం అని వ్యాఖ్యానించారు. త్వరలోనే గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. పలు సత్యాలను అణగదొక్కుతూ అత్యంత కీలకమైన కశ్మీరీ పండిట్ల విషయాన్ని తీసుకుని ఈ సినిమా తీశారని రౌత్ విమర్శించారు. దీని వెనుక బిజెపి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. శివసేన పత్రిక సామ్నాలో తమ వారం వారపు శీర్షిక రోక్‌థోక్‌లో ఇప్పటి అంశాన్ని తీసుకుని రౌత్ స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News