Tuesday, December 24, 2024

22న ఢిల్లీలో అఖిల భారత ఒబిసి ఉద్యోగ సంఘాల సమావేశం

- Advertisement -
- Advertisement -

 

All India OBC Job Unions Meeting in Delhi on 22nd

మనతెలంగాణ/ హైదరాబాద్ : బిసి ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు పెట్టాలని, కుల గణన చేపట్టాలని, బిసి రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్ తో ఈ నెల 22న న్యూఢిల్లీలో అఖిల భారత స్థాయి ఓబిసి ఉద్యోగుల ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు బిసి నాయకులు తెలిపారు. ఆదివారం బిసిభవన్‌లో జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, కేంద్ర ప్రభుత్వ శాఖల ప్రభుత్వ రంగ సంఘాల ఫెడరేషన్ అధ్యక్షులు బి చిన్నయ్య, కార్యదర్శి దానకర్మచారి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఢిల్లీలో ఒబిసి ఉద్యోగ సంఘాల సమావేశం మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి దేశంలోని 29 రాష్ట్రాల నుంచి, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు, అఖిల పక్ష రాజకీయ నాయకులను, ఎంపిలు పాల్గొంటారని తెలిపారు.

ఢిల్లీలో జరిగే అఖిల భారత సమావేశంలో జాతీయ స్థాయిలో బిసి ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి కార్యచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ ఈ దఫా బిసి ఉద్యమాన్ని మిలిటెంట్ రూపంలో చేస్తే తప్ప కేంద్ర ప్రభుత్వం దిగి రాదన్నారు. బిసిలకు ప్రజాస్వామ్య వాటా ఇవ్వకుండా కేంద్రం అణచివేస్తోందన్నారు. పేద కులాలకు న్యాయం జరగకపోతే తిరుగుబాటు తప్పదని కృష్ణయ్య హెచ్చరించారు. సమావేశంలో బిసి ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షులు జి. కృష్ణయాదవ్, చెన్నయ్య, దానకర్ణదారి, నిరంజన్, మల్లేష్, మల్లయ్య, లక్ష్మణ్‌యాదవ్, తెలంగాణా బిసి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు అనంతయ్య, సి. రాజేందర్, అల్లంపల్లి రామకోటి, పగిడాల సుధాకర్, కూనూరు నర్సింహగౌడ్, బి బర్క కృష్ణయాదవ్, చంటిముదిరాజ్, వెంకట్, అరవింద్‌స్వామి, చరణ్ యాదవ్, నిఖిల్, తిరుపతి పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News