- Advertisement -
హైదరాబాద్ : బిజెపి నాయకుడు, హుజూరాబాద్ నియోజకవర్గం శాసనసభ్యుడు ఈటల రాజేందర్‌కు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఆయన పుట్టిన రోజు కావడంతో సిఎం కెసిఆర్ బర్త్‌డే విషెస్ తెలిపుతూ ఈటలకు ప్రత్యేకంగా ఒక ఒక లేఖ పంపారు. ఈటలకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుడిని కోరుకున్నట్లు లేఖలో సిఎం పేర్కొన్నారు. కాగా పలువురు బిజెపి నాయకులతో పాటు కాంగ్రెస్ నాయకులు, అధికార టిఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఈటలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
- Advertisement -