Saturday, December 21, 2024

ఇండియా విదేశీ పాలసీ భేష్

- Advertisement -
- Advertisement -

India's foreign policy better than Pakistan

పాక్ ప్రధాని ఇమ్రాన్ కితాబు

ఇస్లామాబాద్ : భారతదేశపు విదేశాంగ విధానం స్వతంత్య్రంగా ఉందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదివారం కొనియాడారు. విదేశీ విధానాల విషయాలకు వస్తే తాను ఇండియాను అభినందించి తీరాల్సిందేనని ఈ దాయాది దేశ ప్రధాని కితాబు వెలువరించారు. దేశ పార్లమెంట్‌లో ప్రతిపక్షాల నుంచి క్లిష్టస్థాయి అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటున్న దశలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. తమ ప్రభుత్వ విజయాల జాబితాను ఏకరువు పెట్టారు. 25వ తేదీన ఇమ్రాన్ అవిశ్వాస తీర్మానం పార్లమెంట్‌లో ప్రస్తావనకు వస్తుంది. తాను ఈరోజు హిందూస్థాన్‌కో దాద్ దేతా హూ ( పొరుగుదేశాన్ని మెచ్చుకుంటున్నా) . భారత్ ఇప్పుడే కాదు ఎప్పుడూ స్వాతంత్య్ర విదేశాంగ విధానం అవలంభిస్తోంది. ఇండియా అమెరికా మిత్రపక్ష కూటమి దేశంగా పేరు తెచ్చుకుంది. క్వాడ్‌లో భాగస్వామి, తటస్థతను ప్రదర్శించుకొంటోంది. ఇప్పుడు అమెరికా కీలక మిత్రదేశంగా ఉంటూనే ఇప్పుడు రష్యా నుంచి ఇప్పటి అంతర్జాతీయ పరిస్థితుల నడుమ భారీస్థాయిలో కారు చౌక చమురును పొందుతోంది. ఇదంతా కూడా ఈ దేశ స్వతంత్య్ర విదేశాంగ విధాన ఫలితం అనుకోవల్సిందేనని ఖైబర్ ఫక్తూన్‌క్వాలోని మాలాకాండ్ ప్రాంతంలో ఏర్పాటు అయిన బహిరంగ సభలో తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News