Monday, December 23, 2024

ఇన్‌ఫ్రా.మార్కెట్‌పై ఐటీ దాడుల్లో బయటపడిన రూ.224 కోట్లు

- Advertisement -
- Advertisement -

Rs 224 crore recovered from IT attacks on Inframarket

హవాలా నెట్‌వర్క్ ద్వారా రూ. 1500 కోట్లు

న్యూఢిల్లీ : మహారాష్ట్ర కేంద్రంగా ఉన్న యూనికార్న్ అంకుర పరిశ్రమ ఇన్‌ఫ్రా.మార్కెట్ పై ఆదాయం పన్ను దాడుల్లో లెక్కల్లో చూపని రూ. 224 కోట్లు బయటపడినట్టు అధికారులు ఆదివారం వెల్లడించారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ , మధ్యప్రదేశ్‌ల్లోని ఆ సంస్థకు చెందిన 23 బ్రాంచీల్లో మార్చి 9న సోదాలు ప్రారంభమయ్యాయి. సౌవిక్‌సేన్ గుప్తా, ఆదిత్యషార్దా 2016 లో ఈ గ్రూపును నెలకొల్పారని, నిర్మాణసామగ్రి అమ్మకాలను రిటైల్, హోల్‌సేల్ ద్వారా విక్రయిస్తుంటారని, వార్షిక లావాదేవీలు రూ.6000 కోట్లు దాటి ఉన్నట్టు వారి పాన్ ఇండియా చూపిస్తోందని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్టు టాక్సెస్ (సిబిడిటి) వివరించింది. ఆదాయపన్ను విభాగానికి సంబంధించిన విధానపర నిర్ణయాల పాలకవర్గం సిబిడిటి. ఈ నిర్మాణ సామగ్రి మార్కెట్ టైగర్ గ్లోబల్ అనే సంస్థ నుంచి 125 మిలియన్ డాలర్లు (రూ.928.1 కోట్లు) నిధులు పొందినట్టు గత ఏడాది ఆగస్టులో ప్రకటించింది. ఈ కంపెనీ యూనికార్న్ గా గుర్తించారు. అయితే లెక్కల్లో చూపించని రూ.1 కోటి నగదు, రూ22 లక్షల విలువైన నగలు, ఇంతవరకు తాము స్వాధీనం చేసుకున్నామని సిబిడిటి చెప్పింది.

ఈ గ్రూపు బోగస్ కొనుగోళ్లు నమోదు చేసిందని, భారీ ఎత్తున లెక్కచూపని నగదును ఖర్చు పెట్టిందని, దానికి తగ్గట్టు నిధులు పొందిందని, ఈమేరకు రూ.400 కోట్లు సంపాదించిందని సిబిడిటి వివరించింది. ఈ సాక్షాధారాలను మొదట్లో ఖండించిన గ్రూపు డైరెక్టర్లు , బయటపడిన అదనపు సొమ్ము రూ.224 కోట్లు వివిధ సంవత్సరాల మదింపు వల్ల సమకూరాయని ఒప్పుకున్నారని, బకాయిపడిన ఆదాయం పన్ను చెల్లిస్తామన్నారని సిబిడిటి అధికారులు చెప్పారు. ఈ గ్రూపు ఎక్కువ ప్రీమియం చెల్లింపుతో షేర్ల ద్వారా సముద్ర మార్గం మీదుగా భారీ మొత్తం లో విదేశీ నిధులను పొందిందని చెప్పారు. ముంబై, థానే కేంద్రంగా షెల్ కంపెనీల ద్వారా హవాలా నెట్‌వర్క్ సాగిందని బయటపడినట్టు తెలియజేసింది. షెల్ కంపెనీల ద్వారా దాదాపు రూ.1500 కోట్లు సమకూర్చుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సిబిడిటి వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News