లాస్‌ఏంజిల్స్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం
పలికిన ఎన్‌ఆర్‌ఐలకు మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి
మంత్రి కెటిఆర్‌కు పుష్పగుచ్ఛాలతో
ఆత్మీయ, ఆహ్లాద స్వాగతం
తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి,
సంక్షేమ కార్యక్రమాలను వివరించిన
మంత్రి ప్రభుత్వ పాఠశాలలను
ఉన్నతస్థితికి తెచ్చేందుకు ‘మన ఊరు
మన బడి’ని అమలు చేస్తున్నట్లు వెల్లడి
మంచి ఆశయంతో చేపట్టిన
పథకానికి బాసటగా నిలవాలని విజ్ఞప్తి
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చే లక్ష్యంతో అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కె. తారక ఆదివారం ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి అమెరికాలోని లాస్‌ఏంజిల్స్ నగరానికి చేరుకున్న మం త్రికి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు, నాయకులతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎన్నారైలు ఘన స్వాగతం తెలిపారు. ఎయిర్‌పోర్టులో మంత్రి కె టిఆర్‌కు పూల బొకేలు అందించి స్వాగతం తెలిపారు. తనకు స్వాగతం పలికిన ఎన్నారైలతో మంత్రి కెటిఆర్ కొద్దిసేపు అక్కడ ముచ్చటించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి, కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. ప్రధానంగా ‘మన ఊరు.. బడి’ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వారికి వివరించారు. ఈ కార్యక్ర మ ప్రాధాన్యం, ప్రభుత్వ పాఠశాలలను ఏవిధంగా అభివృద్ధి చేస్తున్నామన్న విషయాలను ఎన్‌ఆర్‌ఐలకు మంత్రి కెటిఆర్ వివరించారు. మంచి ఆశయంతో తలపెట్టిన ప్రభుత్వ సంకల్పానికి పెద్దఎత్తున మద్దతు పలకాలని ఎన్నారైలను ఆయన కోరారు. అలాగే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అమెరికాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన బిడ్డలు రాష్ట్ర ప్రభుత్వం తరపున రాయబారులుగా వ్యవహరించాలని కోరారు.