- Advertisement -
నల్గొండ: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఉదయం హాలియా సమీపంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువలో ఓ ప్రేమజంట దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు యువతిని కాపాడారు. అయితే, వరదనీటి ప్రవాహంలో ప్రియుడు గల్లంతైనట్లు తెలుస్తోంది. దీంతో అతని కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. వరుసకు బావమరదలైన వీరు కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఇద్దరి పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకునేందుకు సాగర్ కాలువలోకి దూకినట్లు తెలుస్తోంది.
Lovers suicide attempt as jump into Sagar left Canal
- Advertisement -