- Advertisement -
న్యూఢిల్లీ :ఢిల్లీ నుంచి ఖతార్ వెళ్లే ఓ విమానం కార్గోలో పొగలు వ్యాపించాయి. దీంతో ఈ విమానాన్ని దారి మళ్లించి కరాచీలో అత్యవసరంగా దించాల్సి వచ్చింది. ఖతార్ ఎయిర్‌వేస్‌కు చెందిన క్యూఆర్ 579 విమానం సోమవారం తెల్లవారు జామున 100 మందికి పైగా ప్రయాణికులతో ఢిల్లీ నుంచి దోహాకు బయల్దేరింది. అయితే కాసేపటికే కార్గోలో పొగలు గుర్తించిన సిబ్బంది వెంటనే విమానాన్ని దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. 2 గంటల తరువాత విమానాన్ని పాకిస్థాన్ లోని కరాచీ విమానాశ్రయంలో అత్యవసరంగా దించేసినట్టు ఖతార్ ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, అందులోని ప్రయాణికులను బయటకు పంపించినట్టు తెలిపింది. ఘటనపై విచారణ జరుపుతున్నామని ప్రయాణికులను మరో విమానంలో పంపిస్తామని పేర్కొంది.
- Advertisement -