- Advertisement -
మనతెలంగాణ, సిటిబ్యూరో: ట్యాంక్‌బండ్‌పై ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఇన్స్‌స్పెక్టర్ గాయపడ్డారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం…ఈ ముషీరాబాద్ సిఐ జహంగీర్ యాదవ్ ట్యాంక్‌బండ్‌పై రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టింది. దీంతో ఇన్స్‌స్పెక్టర్ జహంగీర్ తలకు గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా స్వల్ప గాయాలు అయినట్లు వైద్యులు తెలిపారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన కారును, డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -