Tuesday, January 21, 2025

వదినతో వివాహేతర సంబంధం.. తమ్ముడిని చంపిన అన్న

- Advertisement -
- Advertisement -

Brother killed elder brother over extramarital affair

అమరావతి: అన్న భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తమ్ముడిని హత్య చేసిన సంఘటన ఎపి రాష్ట్రం అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం రామదాసు పేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రంగనాథ్, అనంతరాజు(30) అన్నదమ్ములు మడకశిర మండలం ఎర్రబొమ్మనపల్లి గ్రామంలో నివసిస్తున్నారు. రంగనాథ్ భార్యతో అనంతరం రాజు వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆమెను రంగనాథ్ హత్య చేశాడు. ఎనిమిది సంవత్సరాల తరువాత రంగనాథ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యతో కూడా అనంతరాజు వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో అతడిని హత్యాచేయాలని రంగనాథ్ ప్లాన్ వేశాడు. మిద్దెపై నిద్రిస్తున్న అనంత రాజు గొంతుపై రాడ్‌తో దాడి చేశాడు. అనంతరం బెల్ట్‌ను గొంతుకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. మృతదేహాన్ని పట్టాలపై పడేసి అక్కడి నుంచి జారుకున్నాడు. అనంతరాజు భార్య తన భర్త మృతిపై అనుమానం ఉందని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా అనంతరాజును అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని స్థానిక సిఐ శివ శంకర్ నాయక్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News