Monday, December 23, 2024

చైనా విమాన ప్రమాదంలో లభించని బ్లాక్ బాక్స్

- Advertisement -
- Advertisement -

Black box not found in China plane crash

మృతదేహాల కోసంసాగుతున్న గాలింపు

బీజింగ్: దక్షిణ చైనాలో సోమవారం చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాదం సంభవించిన ప్రదేశంలో సహాయక బృందాల అన్వేషణ కొనసాగుతోంది. 123 మంది ప్రయాణికులు, 9 మంది విమాన సిబ్బందితో వెళుతున్న బోయింగ్ 737 విమానం పర్వతాన్ని ఢీకొని పేలిపోగా మృతదేహాల కోసం సహాయక బృందాలు మంగళవారం కూడా గాలింపు చర్యలు కొనసాగించాయి. ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన వారు కాని మృతదేహాల ఆచూకీ కాని తెలియరాలేదు. ప్రమాదానికి గల కారణాలను బయటపెట్టగల బ్లాక్‌బాక్స్ కూడా ఇప్పటివరకు లభించలేదని హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక పేర్కొంది. కున్‌మింగ్ నుంచి గ్వాంగ్‌జౌ వెళుతున్న ఈ విమానం సోమవారం మధ్యాహ్నం 2.38 గంటల ప్రాంతంలో వుజౌ నగర సమీపంలోని మొలాంగ్ గ్రామం వద్ద పర్వతాన్ని ఢీకొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News