అమెరికా: అన్ని రంగాల్లో అప్రతిహతంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రగతి ప్రస్తానంలో ప్రవాస తెలంగాణ పౌరులు కలిసి నడవాలని మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో అమెరికాలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ పర్యటిస్తున్నారు. ప్రవాస భారతీయులు మిలిపిటాస్‌లోని ఇండియన్ కల్చరల్ సెంటర్‌లో నిర్వహించిన మీట్ & గ్రీట్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
ఏడేండ్ల క్రితం పసికూన లాంటి తెలంగాణను ఇదే వేదిక నుండి పరిచయం చేశానని గుర్తు చేశారు. ఏడేండ్ల తరువాత నేడు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణ గురించి తెలియజెప్పడానికి వచ్చానని మంత్రి చెప్పారు. మీరు పుట్టిన గడ్డకు ఏదైనా చేయాలనే అలోచన మీలో ఉంటే తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన “మన ఊరు మన బడి” కార్యక్రమంలో మీ ఊరిబడిని దత్తత తీసుకుని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు.
- Advertisement -