- Advertisement -
హైదరాబాద్: బోయిగూడలోని స్క్రాప్ గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ ప్రమాదంలో బీహార్ కు చెందిన 11మంది పేద కార్మికులు సజీవదహనం కావడం కలచివేసిందన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానన్నారు. పొట్టకూటి కోసం వచ్చి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని పేర్కొన్నారు.
Bandi Sanjay reacts on Fire Accident in Bhoiguda
- Advertisement -