Saturday, January 11, 2025

లోక్‌సభ సభ్యత్వాన్ని అందుకే త్యాగం చేశా…..

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ సభ్యత్వాన్ని అందుకే త్యాగం చేశా…..
అఖిలేష్ యాదవ్ వివరణ

Lok Sabha membership sacrificed

లక్నో: ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం కోసం తన లోక్‌సభ సభ్యత్వాన్ని త్యాగం చేయక తప్పలేదని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు, ఉత్తర్ ప్రదేశ్ ఎమ్మెల్యే అఖిలేష్ యాదవ్ అన్నారు. ఇటీవల జరిగిన యుపి అసెంబ్లీ ఎన్నికల్లో కర్హల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అఖిలేష్ మంగళవారం తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన లోక్‌సభలో యుపిలోని అజంగఢ్ పార్లమెంటరీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కోట్లాది మంది యుపి ప్రజలు తనకు నైతిక విజయాన్ని అందచేశారని, ఈ తీర్పును గౌరవించి తాను కర్హల్‌కు ప్రాతినిధ్యం వహిస్తానని, అజంగఢ్ పురోభివృద్ధి కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని బుధవారం అఖిలేష్ ట్వీట్ చేశారు. ఇలా ఉండగా..యుపి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుని బాధ్యతలు అఖిలేష్ చేపడతారని ఊహాగానాలు సాగుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ నెల 25న రెండోసారి బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు 26వ తేదీన కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సిలతో ఒక సమావేశాన్ని సమాజ్‌వాది పార్టీ నిర్వహించనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News