Thursday, December 19, 2024

సమీపిస్తున్న జలమండలి ఉద్యోగుల ఎన్నికలు గడువు

- Advertisement -
- Advertisement -

ఉద్యోగులను తమ వైపు తిప్పుకుంనేందుకు నేతల ఎత్తులు
పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్న వాటర్‌వర్క్ ఎంప్లాయిస్ యూనియన్
తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన యూనియన్ నాయకులు

Water board employees Elections

మన తెలంగాణ,సిటీబ్యూరో: జలమండలి ఉద్యోగుల ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో ఆయా యూనియన్ల నేతలు విజయబావుటా ఎగురవేసేందుకు ఉదృత్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈనెల 26 ఎన్నికలు ఉండటంతో రెండోసారి గెలిచేందుకు వాటర్ వర్క్ ఎంప్లాయిస్ యూనియన్ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తుంది. ఆ యూనియన్ తరుపును టిఆర్‌ఎస్‌కెవి రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ బరిలో ఉండి ప్రతి డివిజన్‌కు వెళ్లి ఉద్యోగులను కలుస్తూ మరోసారి మద్దతు పలికితే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తానని పేర్కొంటున్నారు. బుధవారం ఖైరతాబాద్ వాటర్‌బోర్డు ప్రధాన కార్యాలయంలో తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాల కాలంలో గతంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు పరుచడమే కాకుండా అనేక సమస్యలు పరిష్కరించామన్నారు. సిఎం కెసిఆర్ ఉద్యోగులకు పదవి విరమణ వయస్సు 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచారని, అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న హెల్త్ కార్డు కోరిక నేరవేర్చినట్లు తెలిపారు. పిఆర్సీ బకాయిలు చరిత్రలో ఎన్నడులేని విధంగా ఒకేసారి ఇప్పించడం జరిగిందన్నారు. ఎక్కడ ప్రచారానికి వెళ్లితే ఉద్యోగుల బ్రహ్మరథం పడుతున్నట్లు, తమను గెలిపిస్తే బోర్డులో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని, అనేక సంవత్సరాల పదోన్నతికి నోచుకుని ఉద్యోగులందరికి ప్రమోషన్స్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.

బోర్డు క్వార్టర్స్‌ను అత్యవసర సర్వీసులో పనిచేయు కార్మికులకు ఇంటి కిరాయి లేకుండా ఇప్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఎలక్షన్ జరిగిన వెంటనే వారంలోగా విద్యార్హత కలిగిన వారికి జెటిఓ కోటాగా ప్రమోషన్ ఇప్పిస్తాం. ఔట్‌సోర్సింగ్ కార్మికులకు గొడుగులకు బదులుగా రెయిన్ కోట్‌లు ఇప్పించుటకు కృషి చేస్తాం. ప్రస్తుత ఉద్యోగ కార్మికులు మెడికల్ సెలవులో వెళ్లితే ప్రభుత్వ వైద్యులు, బోర్డు వైద్యులు కూడా సర్టిపై చేయాల్సి ఉంటుంది. దానికి బదులుగా బోర్డు డాక్టర్ ద్వారా సర్టిపై చేస్తే సరిపోయేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. మిగతా యూనియన్ల నేతలు ఇష్టానుసారంగా హామీలు కురిపిస్తూ ఉద్యోగులను ఆకట్టుకునేందుకు తంటాలు పడుతున్నారు.గత రెండు రోజుల నుంచి వాటర్ వర్క్ ఎంప్లాయిస్ యూనియన్ నిర్వహిస్తున్న ప్రచారంలో ఉద్యోగులు భారీగా పాల్గొంటూ మరోసారి రాంబాబుయాదవ్‌కు అవకాశం ఇస్తామని వెల్లడిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News