- Advertisement -
మాట తప్పిన తాలిబన్లు
కాబూల్ : ఇచ్చిన వాగ్ధానాలను పక్కకు పెట్టి అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు బాలికల ఉన్నత విద్యకు అవకాశాలను తిరస్కరించారు. ఆరవ తరగతి తరువాత బాలికలకు స్కూళ్లను ప్రారంభించే ప్రసక్తే లేదని ఇక్కడి తాలిబన్ పాలకులు తేల్చిచెప్పారు. బాలికలకు ఉన్నత విద్యావకాశాల తిరస్కరణ నిర్ణయాన్ని తాలిబన్లు బుధవారం నిర్థారించారు. ఇక్కడి బాలికల ఉన్నత విద్యకు అంతర్జాతీయంగా పలు సంస్థలు విరాళాలకు ముందుకు వచ్చాయి. అయితే వీటిని తోసిపుచ్చే రీతిలో తాలిబన్లు దేశంలో బాలికలకు ఉన్నత విద్యాబోధనా స్కూళ్ల ప్రారంభం ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
- Advertisement -