Friday, January 3, 2025

జెఎన్‌యూ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్‌కు అల్లర్ల కేసులో బెయిల్ నిరాకరణ

- Advertisement -
- Advertisement -

Umar Khalid
న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జెఎన్‌యూ) మాజీ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్‌పై ఈశాన్య ఢిల్లీలో 2020 నాటి అల్లర్ల తర్వాత నమోదైన చట్టవిరుద్ధ కార్యాకలాపాల(నివారణ) సవరణ చట్టం(యుఎపిఎ) కేసుకు సంబంధించి  జిల్లా కోర్టు గురువారం బెయిల్ నిరాకరించింది. కర్కర్‌దూమా జిల్లా కోర్టులో అదనపు సెషన్స్ జడ్జీ అమితాబ్ రావత్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కోర్టు బెయిల్ దరఖాస్తును 8 నెలలుగా విచారిస్తోంది. గతంలో మూడుసార్లు ఉత్తర్వులను వాయిదా వేసింది. ఈ కేసులో విచారణ కోర్టు ఇటీవల మార్చి 14న మాజీ కౌన్సిలర్ ఇష్రత్ జహాన్‌కు మొదటి బెయిల్ మంజూరు చేసింది. కాగా మరో ఇద్దరు నిందితులు గుల్ఫీషా ఫాతిమా, తస్లీమ్ అహ్మద్‌లకు కూడా మార్చి 16న కోర్టు బెయిల్ నిరాకరించింది.
ఉమర్ తరఫు న్యాయవాది త్రిదీప్ పైస్ ఈ కేసులో సాక్షులు బూటకం అని వాదించారు. ఉమర్ ప్రమేయాన్ని చూపించడానికి ఎటువంటి ఆధారాలు లేనందున ఛార్జిషీట్ అంతా దర్యాప్తు అధికారి కల్పితాలని వాదించారు. ‘ఛార్జీషీటు చెత్త. ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయకూడదు’ అన్నారు. “ఈ చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక సవరణ చట్టం(యుఎపిఎ) కేసులో సాక్షులు తప్పుడు స్టేట్‌మెంట్లు చేశారు, అర్ధసత్యాలపై కేసు పెట్టలేము’ అని పైస్ వాదించారు. ఉమర్ అరెస్టు విషయంలో పోలీసులు సాక్షులను ఎంచుకున్నారని కూడా వాదించారు. ‘రక్షిత సాక్షి స్థానిక పోలీస్ స్టేషన్ హెడ్‌తో టచ్‌లో ఉన్నారని, ఈశాన్య ఢిల్లీలో అల్లర్ల ప్రణాళిక గురించి కూడా అతడికి తెలిపాడు. కుట్ర గురించి పోలీసులకు తెలిసాక నగరంలో ఎందుకు అల్లర్లు జరిగాయి’ అని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News