న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాధి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కొవిడ్19 నిబంధనలను ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా మార్చి 31 నుంచి ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. కానీ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు మాత్రం అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం 2020 మార్చి 24న కొవిడ్ నిబంధనల్ని అమలులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతున్నందున మార్చి 31 నుంచి నిబంధనల్ని ఎత్తివేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. విపత్తు నిర్వహణ చట్టం కింద అమల్లో ఉన్న కరోనా కట్టడి ఆంక్షల్ని ఎత్తేస్తున్నట్లు అజయ్ భల్లా తన లేఖలో పేర్కొన్నారు. కరోనా వైరస్ ఎప్పుడు ఎలా రూపాంతరం చెందుతుందో తెలియదు. కనుక ప్రభుత్వాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన తన లేఖలో హెచ్చరించారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 23913. రోజువారీ పాజిటివ్ రేటు 0.26శాతానికి పడిపోయింది. ఇదిలావుండగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా కేసులు 1778 నమోదయ్యాయి. మరణాలు 62. యాక్టివ్ కేసులు 800 తగ్గి 23087గా ఉందని ప్రభుత్వ డేటా తెలిపింది.
31 నుంచి కరోనా ఆంక్షల ఎత్తివేత!
- Advertisement -
- Advertisement -
- Advertisement -