కేంద్రానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదు
పప్పు దినుసుల సేకరణకు తేడా తెలియదు
బిజెపి సన్నాసులు రైతులను రెచ్చగొడుతున్నారు
ప్రజలను అన్ని విషయాల్లో కేంద్రం మోసం చేసింది
మోడీ పాలనలో ఎలాంటి నూతనత్వం లేదు :
ఢిల్లీలో విలేకరుల
సమావేశంలో రాష్ట్ర
మంత్రులు సిఎంతో
చర్చించాకే కార్యాచరణ
పీయూష్ గోయల్ వైఖరి అహంకార పూరితం
ధాన్య సేకరణపై ఢిల్లీలో మోడీ ప్రభుత్వ ధోరణిని చీల్చిచెండాడిన రాష్ట్ర మంత్రులు
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రం తీరు దురదృష్టకరమని, పీయూష్ గోయల్ వైఖరి అహంకారపూరితంగా ఉందని రాష్ట్ర మంత్రు లు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ , ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్, రాజ్యసభ సభ్యుడు కేశవరావు, పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు తదితరులు ఆరోపించారు. దేశంలో ఒక రా ష్ట్రం పట్ల కేంద్రం ఇటువంటి వైఖరి ప్రదర్శించడం వైఖరి అవాంఛనీయమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం అ నంతరం గురువారం ఢిల్లీ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పాడిందే పాట అన్నట్లుగా కేంద్రం, నరేంద్ర మోడీ వైఖరి ఉందని వారు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దుర్మార్గ పూరితం గా మాట్లాడారని, తమకంటే ముందే పీయూష్ గో యల్ మీడియా వద్దకు ఆతృతగా వచ్చి రాష్ట్ర ప్రభు త్వం రైతులను తప్పుదారి పట్టిస్తుందని చెప్పడం సి గ్గుచేటని వారు విమర్శించారు. పండిన పంట కొనుగోలు బాధ్యత అంతా కేంద్రానిదే అని, కేంద్రానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదని వా రు దుయ్యబట్టారు. ధాన్యం సేకరణకు, పప్పు దినుసుల సేకరణకు తేడా కేంద్రానికి తెలియడం లేదన్నారు. కేంద్రం ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారనుకోవడం అవివేకమని వారు పేర్కొన్నారు.
వడ్లను వడ్ల లాగా సేకరించాలి
వడ్లను వడ్ల లాగా సేకరించాలని, గోధుమల సేకర ణ అంటే గోధుమ పిండి సేకరిస్తారా? బిజెపికే తెలి వి ఉందని, ఇతరులకు లేనట్లు భావిస్తున్నారని వా రు ఆరోపించారు. దేశ రైతులను రోడ్డు మీద నిలబెట్టి దాదాపు 700 మంది చావుకు కారణమైన సిగ్గులేని ప్రభుత్వం బిజెపి అని ఆఖరుకు రైతులకు చేతులెత్తి మొక్కి క్షమాపణ చెప్పింది నిజం కాదా?తెలంగాణ బిజెపి సన్నాసులు మేం కొనిపి స్తాం మీరు వరి వేయండి అని రైతులను రెచ్చగొట్టారన్నారు. తెలంగాణ రైతులకు తాము విజ్ఞప్తి చేసి 50 లక్షల ఎకరాల వరి సాగును 30 లక్షలకు తగ్గించామన్నారు. కేంద్రంలో ఉన్నది మాపున లె క్కలు చూసుకునే వ్యాపారాత్మక ప్రభుత్వమన్నారు.
పంటను కొనకపోవడం సిగ్గుచేటు
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభు త్వం నీళ్లిచ్చి, కరెంటు ఇచ్చి, రైతుబంధు ఇచ్చి, రైతుభీమా ఇచ్చి పంటలు సాగు చేసేలా ప్రోత్సహించిందన్నారు. ఇన్ని చేసినందుకు మాది రైతు వ్యతిరేక ప్రభుత్వమా ? అని వారు ప్రశ్నించారు. పండిన ధాన్యం కొనాల్సిన బాధ్యత ఉన్న కేంద్రం నిరాకరించడం దుర్మార్గ చర్యగా వారు అభివర్ణించారు. రైతుల ఆదాయం 2022 వరకు రెట్టింపు చేస్తామన్న కేంద్రం కనీసం రైతులు పండించిన పంటలను కొనకపోవడం సిగ్గుచేటని వారు విమర్శించారు. ఈ దేశంలో ప్రజలను అన్ని విషయాల్లో కేంద్రం మోసం చేసిందన్నారు. తెలంగాణ ప్రజలకు, దేశ రైతాంగానికి కేంద్రం క్షమాపణ చెప్పే పరిస్థితి త్వరలోనే వస్తుందన్నారు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమాఖ్య స్ఫూర్తి లేదని, కేంద్రం వివక్ష చూపుతుందని 2013లో రైతులతో సమావేశం పెట్టారన్నారు. ఈ రోజు అదే సమాఖ్య స్ఫూర్తిని మోడీ నాయకత్వంలోని కేంద్రం దెబ్బ తీస్తుందన్నారు.
మోడీ పాలనలో ఎలాంటి నూతనత్వం లేదు
ఈ దేశ జీడిపి పెంపుదలలో కేంద్రం విఫలమయ్యిందన్నారు. ఈ దేశంలో నిరుద్యోగం నియంత్రించడంలో కేంద్రం విఫలమయ్యిందని వారు ఆరోపించారు. ఇన్నేళ్లలో మోడీ పాలనలో ఎలాంటి నూతనత్వం లేదని, ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం వైఖరి దుర్మార్గంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సూచన మేరకు ఈ విషయంలో ముందుకువెళ్తామన్నారు. పశు, పక్షాదులకు నీళ్లు లేని చోట ఎండాకాలంలో చెరువుల అలుగులు పారిస్తున్నామన్నారు. తెలంగాణ రైతులను ఆదుకున్నది కెసిఆర్ కాదా? ఈ కేంద్రంలోని బిజెపి మొనగాళ్లా ? అని వారు ప్రశ్నించారు. తమకు అధికారం లేని చోట ఇతర పార్టీల ప్రభుత్వాలను కేంద్రంలోని బిజెపి ఇబ్బందులు పెడుతుందని వారు ఆరోపించారు. అబద్దాలతో బిజెపి అధికారంలోకి వచ్చిందని, వారి మేనిఫెస్టోను చూస్తేనే ఈ విషయం బోధపడుతుందన్నారు.
యాసంగిలో వచ్చే వడ్లను మొత్తం కొనాల్సిందే: మంత్రి నిరంజన్ రెడ్డి
యాసంగిలో వచ్చే వడ్లను మొత్తం కొనాల్సిందేని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. పంజాబ్‌లో ఒకే సీజన్‌లో ధాన్యం పండిస్తారని, రెండో సీజన్‌లో గోధుమలు పండిస్తారని మంత్రి తెలిపారు. రాష్ట్రాన్ని, ప్రజలను కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్ అవహేళన చేసేలా మాట్లాడరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై అందరూ సిఎంలు, శాస్త్రవేత్తలను పిలిచి చర్చ పెట్టాలన్నారు. పండిన పంట కొనకుండా ఇబ్బందులు పెడతారా, పంట పెట్టుబడికి పైసా ఇవ్వకుండా మాపైనే అభాండాలు వేస్తారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదాముల్లో మురిగిపోతున్న ధాన్యాన్ని పేదలకు పంచవచ్చు కదా అని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. మీడియా సమావేశం అనంతరం మంత్రులు హైదరాబాద్ బయలుదేరి వచ్చారు. తదుపరి కార్యాచరణను సిఎంతో చర్చించి నిర్ణయం