Friday, December 20, 2024

ఆ స్థానాన్ని భర్తీ చేయడం అనుకున్నంత తేలికకాదు..

- Advertisement -
- Advertisement -

Ravindra Jadeja Appointed as CSK Captain

ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ వంటి ప్రతిష్టాత్మకమైన జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు రవీంద్ర జడేజా పేర్కొన్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ వంటి దిగ్గజ స్థానాన్ని భర్తీ చేయడం అనుకున్నంత తేలికకాదన్నాడు. అయితే తనకు ధోనీ భాయ్ సేవలు అందుబాటులో ఉండడం వరంలాంటిదేనన్నాడు. అతని సలహాలు, సూచనలు తీసుకుంటూ జట్టును ముందుకు నడిపిస్తానని తెలిపాడు. చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు మహేంద్ర సింగ్ ధోనీ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ధోనీ సారథ్యంలో సిఎస్‌కె నాలుగు సార్లు ఐపిఎల్ విజేతగా నిలిచింది. ధోనీ కెప్టెన్సీలో చెన్నై 2010, 2011, 2018, 2021 ఐపిఎల్ ట్రోఫీలను సాధించింది. అంతేగాక 2008, 2012, 2013, 2015, 2019 సీజన్లలో సిఎస్‌కె రన్నరప్‌గా నిలిచింది. కాగా, ఐపిఎల్ 15వ సీజన్ ఈ నెల 26న ప్రారంభం కానుంది.

Ravindra Jadeja Appointed as CSK Captain

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News