న్యూఢిల్లీ: రేషన్ కార్డు, ఆధార్ కార్డు అనుసంధానం గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఆధార్ కార్డులను రేషన్ కార్డుతో అనుసంధానించే గడువును ప్రభుత్వం మార్చి 31 నుంచి జూన్ 30 వరకు పొడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారుల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం పలు రకాల నిర్ణయాలు తీసుకుంటోంది. ‘వన్ నేషన్ వన్ రేషన్ కారు’్డ పథకం
కూడా ఇందులో భాగమనే చెప్పుకోవచ్చు. దీనివల్ల లక్షలాది మందికి ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా వలస కూలీలకు, కార్మికులు ఈ పథకం వల్ల ప్రయోజనం లభిస్తోంది. దీనివల్ల దేశంలో ఎక్కడి నుంచైనా రేషన్ సరకులు పొందొచ్చు. అయితే ఈ ప్రయోజనం పొందాలనుకునేవారు మాత్రం తప్పనిసరి రేషన్ కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానించాల్సిందే. ‘వన్ నేషన్ వన్ రేషన్ కార్డు’ పథకం కింద 80 కోట్ల లబ్ధిదారులు ఉన్నారు. ఫిబ్రవరి నాటికి 96 శాతం మంది లబ్ధిదారులు ఓఎన్‌ఓఆర్‌సి కింద నమోదు చేసుకున్నారు.
ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనుసంధానం గడువు పొడిగింపు!
- Advertisement -
- Advertisement -
- Advertisement -