Saturday, December 21, 2024

మొక్కలు నాటిన నవ దంపతులు

- Advertisement -
- Advertisement -

Trees planted in Green India challenge

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని చంద్రకళ దంపతులు అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మంత్రి సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో కల్యాణ లక్ష్మీకి ప్రేరణ అయిన కల్పన కూతురు చంద్రకళ దంపతులు మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని నవ దంపతులు అన్నారు.

జూబ్లీహిల్స్‌లో నటి ఎస్తర్..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా శుక్రవారం జూబ్లీహిల్స్ జిహెచ్‌ఎంసి పార్క్‌లో సినీ నటి ఎస్తర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్తర్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు.వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలంటే మొక్కలు నాటడం ఒక్కటే పరిష్కారం అని అన్నారు.ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణం అందించడం మన కర్తవ్యం అని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఎంపి సంతోష్ కుమార్‌కు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి,నిర్మాత బాపిరాజు, నటుడు అజయ్‌కి ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఆమె చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News